keerthi suresh: సావిత్రిగారిలా చేయడం ఓ సాహసమేనని అర్థమైంది: కీర్తి సురేశ్

  • సావిత్రిలా నటించడం ఓ సవాలే 
  • ఆమెలా హావభావాలు పలికించడం సాధ్యం కాదు 
  • 100 రకాల కాస్ట్యూమ్స్ లో కనిపిస్తాను

సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తాజాగా కీర్తి సురేశ్ ఈ సినిమాను గురించి స్పందిస్తూ .. సావిత్రిగారిలా నటించడం నిజంగా సాహసమేననే విషయం అర్థమైందని చెప్పింది. '10 సెకన్లలో 100 రకాల ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వగల ప్రతిభావంతురాలు సావిత్రి గారు. ఆమెలా హావభావాలను ప్రదర్శించడం ఒక సవాలుగానే అనిపించింది' అని అంది.

'వయసును బట్టి సావిత్రి మారుతూ వచ్చింది .. నేను అలాగే కనిపించవలసి వస్తుంది. ఈ విషయంలోను ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం కాదు' అని కీర్తి సురేశ్ అంది. ఈ సినిమా కోసం తాను దాదాపు 100 రకాల కాస్ట్యూమ్స్ తో కనిపించనుండటం ఓ విశేషమని చెప్పింది. ఈ సినిమా ప్రత్యేకతల్లో ఇది ఒకటిగా కనిపిస్తుందని అంది. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో మోహన్ బాబు .. దుల్కర్ సల్మాన్ .. విజయ్ దేవరకొండ .. సమంత .. షాలిని పాండే నటిస్తోన్న సంగతి తెలిసిందే.        

keerthi suresh
samanta
  • Loading...

More Telugu News