ram charan: జీఈఎస్ లో రామ్ చరణ్ ప్రసంగించాల్సి ఉంది.. కానీ,..: ఉపాసన

  • ఇతర కార్యక్రమాల వల్ల చరణ్ రావడం లేదు
  • మన దేశంలో ఆరోగ్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి
  • జీఈఎస్ నుంచి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది

హైదరాబాదులో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ, ఈ సదస్సుకు చరణ్ కూడా హాజరై ప్రసంగించాల్సి ఉందని... కానీ, కొన్ని ఇతర కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన జీఈఎస్ కు రావడం లేదని చెప్పారు. ఆరోగ్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

మన దేశంలో ఆరోగ్య రంగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని... ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని అన్నారు. ఇటీవలి కాలంలో యువ వ్యాపారుల సంఖ్య బాగా పెరిగిందని... అయినప్పటికీ అవకాశాలు మాత్రం కాస్త తక్కువగానే ఉన్నాయని... జీఈఎస్ లాంటి సదస్సుల వల్ల ఈ లోటు తీరుతుందని భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల నుంచి కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

ram charan
upasana
ges summit
  • Loading...

More Telugu News