bvs ravi: పవన్ కల్యాణ్ చాలా గొప్పవాడు .. అలాంటివాళ్లు లీడర్స్ కావాలి: బీవీఎస్ రవి

  • పవన్ కల్యాణ్ అంటే ఓ నిజాయితి
  • వ్యక్తిత్వంలో ఆయన ఓ శిఖరాగ్రం  
  • అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు 
  • ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తారు

"పవన్ కల్యాణ్ సినిమా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాకు మీరు వర్క్ చేశారు .. ఆయనతో జర్నీ మీకు ఎలా అనిపించింది?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో బీవీఎస్ రవికి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. " పవన్ కల్యాణ్ అంటే ఒక నిలకడ .. ఒక నిజాయితీ .. ఆయనది శిఖరాగ్రమైన వ్యక్తిత్వం. ప్రతి విషయంలో ఆయన చాలా బ్యాలెన్స్డ్ గా వుంటారు .. ఆచితూచి మాట్లాడతారు" అని అన్నారు.

"గొప్ప విషయం ఏమిటంటే అందరితోనూ ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. వీడు ఇలాంటివాడు .. వాడు అలాంటివాడు అనుకునే మనస్తత్వం కాదాయనది. ఎవరి వ్యక్తిత్వం వాళ్లదని అనుకుంటారు. తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకుంటూ .. తనదైన మార్గంలో నడుస్తూ .. వివిధ రకాల వ్యక్తిత్వాలు వున్నవారికి విలువనిస్తూ ముందుకెళ్లే సంస్కారం,  గొప్ప లీడర్స్ కి ఆభరణం. అలాంటివాళ్లు లీడర్స్ కావాలి" అంటూ చెప్పుకొచ్చారు.      

bvs ravi
pavan kalyan
  • Loading...

More Telugu News