sai dharam tej: సాయిధరమ్ తేజ్ నా ఇంట్లో దీపం పెట్టాడు: 'జవాన్' దర్శకుడు బీవీఎస్ రవి

  • తేజు 'సుప్రీమ్' చేస్తుండగా 'జవాన్' కథ చెప్పాను  
  • 'నక్షత్రం'లో ఆయన నిడివి పెరగడంతో 'జవాన్' స్టార్ట్ అవడం లేటయింది 
  • ఈ సినిమా కోసం ఏడాదికి పైగా ఎదురుచూశాను     

రచయిత బీవీఎస్ రవి .. దర్శకుడిగా కొంతకాలం క్రితం 'వాంటెడ్' సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించకపోవడంతో, ఆయనకి మరో అవకాశం రావడం బాగా ఆలస్యమైంది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'జవాన్' వచ్చేనెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన ఐ డ్రీమ్స్ తో ముచ్చటిస్తూ "  సాయిధరమ్ తేజ్ 'సుప్రీమ్' సినిమా చేస్తుండగా 'జవాన్' కథ చెప్పాను" అని అన్నారు.

 "ఆ తరువాత సాయిధరమ్ తేజ్ 'తిక్క' .. 'విన్నర్' .. 'నక్షత్రం' మూడు సినిమాలు చేశాడు. 'నక్షత్రం' సినిమాలో ఆయన పాత్ర నిడివి పెరిగిపోవడంతో .. నా సినిమా పట్టాలెక్కడానికి మరింత ఆలస్యమైంది. ఆ సినిమా చేసిన తరువాత ఆయన నా సినిమా చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆయనతో సినిమా చేయడానికి ఏడాదికి పైగా ఎదురుచూస్తోన్న నాకు .. ఆ మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి .. నా ఇంట్లో ఆయన దీపం పెట్టినట్టుగా అనిపించింది" అన్నారు.   

sai dharam tej
mehreen
  • Loading...

More Telugu News