pavan kalyan: 'అజ్ఞాతవాసి' తరువాత పవన్ కల్యాణ్ సినిమా ఇదే!

  • సినిమాలకు విరామం వార్తలు అవాస్తవమే
  • 'వేదాళం' రీమేక్ కు ఓకే చెప్పిన పవన్
  • జనవరి నుంచి షూటింగ్!

తన కెరీర్ లో సగానికి పైగా రీమేక్ చిత్రాలను చేసిన పవర్ స్టార్ మరో రీమేక్ కు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం తాను చేస్తున్న 'అజ్ఞాతవాసి' తరువాత రాజకీయాలపై దృష్టిని సారించేందుకు కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటిస్తారని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పేలా, ఏఎం రత్నం నిర్మాతగా, నేసన్ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు.

 తమిళంలో అజిత్ హీరోగా నటించగా, సూపర్ హిట్ అయిన 'వేదాళం' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి తయారు చేసే స్క్రిప్టు పనులు ఇప్పుడు చివరి దశకు వచ్చాయని తెలుస్తోంది. మిగతా నటీనటులను, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పని పూర్తయిన తరువాత, జనవరి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం.

pavan kalyan
vedalam
ajit
new movie
  • Loading...

More Telugu News