North Korea: అత్యంత శక్తిమంతమైన క్షిపణిని ప్రయోగించిన ఉత్తరకొరియా.. తెల్లవారుజామున ప్రయోగం

  • రెండు నెలల శాంతికి చెక్ చెప్పిన కిమ్
  • అత్యంత శక్తిమంతమైన ఐసీబీఎం ప్రయోగం
  • జపాన్ ఎకనమిక్ జోన్‌లో పడిన క్షిపణి
  • అప్రమత్తంగా ఉన్నామన్న అమెరికా

రెండు నెలలపాటు సహనంగా ఉన్న ఉత్తర కొరియా బుధవారం తెల్లవారుజామున అత్యంత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించి మరోసారి ఉద్రిక్తతలకు తెరలేపింది. నార్త్ కొరియా ప్రయోగించిన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ (ఐసీబీఎం) జపాన్ స్పెషల్ ఎకనమిక్ జోన్ సమీపంలో పడినట్టు ఆ దేశ రక్షణ మంత్రి తెలిపారు. ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం గురించి తెలిసిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ విషయంలో తాము అప్రమత్తంగా ఉన్నట్టు చెప్పారు. నార్త్ కొరియా మిసైల్ టెస్ట్‌తో ప్రపంచం మొత్తానికి ముప్పు పొంచి ఉందని అమెరికా రక్షణ కార్యదర్శి మాటిస్ పేర్కొన్నారు.

రెండు నెలల క్రితం వరకు ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు, పరీక్షలు చేపట్టింది. అణు పరీక్షలు కూడా నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి, అమెరికా ఆంక్షలను తోసిరాజని వరుస పరీక్షలతో ఉద్రిక్తతలు నింపింది. ఒక దశలో అమెరికా-నార్త్ కొరియా మధ్య యుద్ధం తప్పదన్న వార్తలూ వచ్చాయి. అయితే, విచిత్రంగా నార్త్ కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ వెనక్కి తగ్గారు. రెండు నెలలుగా ఎటువంటి వార్తలు లేవు. తాజాగా ఈ తెల్లవారుజామున 3.17 గంటలకు ఐసీబీఎం ప్రయోగంతో ప్రపంచం దృష్టిని మరోమారు తనవైపు తిప్పుకున్నారు.

  • Loading...

More Telugu News