sai dharam tej: ఓ హీరోయిన్ ను 'డేటింగ్ చేద్దామా?' అని అడిగా... కుదర్లేదన్న మెగా హీరో!
- మరికొన్ని గంటల్లో వెండితెరలను తాకనున్న 'జవాన్'
- ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్
- డేటింగ్ కు అడిగితే, బాయ్ ఫ్రెండ్ ను అడిగి చెబుతానంది
తాను హీరోగా నటించిన 'జవాన్' చిత్రం మరికొన్ని గంటల్లో వెండి తెరలను తాకనున్న వేళ, మెగా హీరో సాయి ధరమ్ తేజ్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీవీ చానల్ లో వచ్చే కార్యక్రమంలో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వీక్షకులను నవ్వించాడు.
డేటింగ్ పై వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "ఇంతవరకూ ఏ హీరోయిన్ కూడా నన్ను డేట్ కి పిలవలేదు. నేనే ఓ హీరోయిన్ ను డేటింగ్ కు రమ్మని అడిగాను. ఆమె ఏం చెప్పిందో తెలుసా? తన బాయ్ ఫ్రెండ్ ను అడిగి చెబుతానని చెప్పింది" అంటూ నవ్వేశాడు. ఇక ఆ హీరోయిన్ ఎవరంటే, 'తిక్క' సినిమాలో నటించిన లారిస్సా బోనేసి! గతంలో లారిస్సా, తేజ్ లపై చాలా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇద్దరూ వాటిని ఖండించారు కూడా.