ivanka trump: ఫలక్ నుమా ప్యాలెస్ కు బయల్దేరిన మోదీ!

  • ఫలక్ నుమా ప్యాలెస్ విందుకు సర్వం సిద్ధం
  • హెచ్ఐసీసీ నుంచి మోదీ ప్రయాణం
  • ట్రైడెంట్ నుంచి ఇవాంకా

హెచ్ఐసీసీలోని జీఈ సదస్సు ప్రాంగణం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఫలక్ నుమా ప్యాలెస్ కు బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ కు మోదీ విందునివ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్యాలెస్ కు పయనమయ్యారు. కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు.

ఇక ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఇవాంకా ట్రంప్ అక్కడికి చేరుకోవాల్సి ఉంది. ట్రైడెంట్ హోటల్ నుంచి ఆమె నేరుగా అక్కడికి చేరుకుంటారు. 25 బస్సుల్లో విదేశీ పారిశ్రామిక వేత్తలు అక్కడికి బయల్దేరారు. వారు కూడా కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. 

ivanka trump
Narendra Modi
faluknuma palace
dinner
  • Loading...

More Telugu News