tiger shroff: 'ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చిపని చేయవద్దు' అంటూ అభిమానికి క్లాస్ పీకిన బాలీవుడ్ నటుడు

  • స్టంట్ చేసిన టైగర్ ష్రాఫ్ అభిమాని
  • 13 అడుగుల ఎత్తైన గోడపై నుంచి దూకిన అమన్
  • పిచ్చి పనులు చేయవద్దంటూ టైగర్ క్లాస్

'ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చిపని చేయకు' అంటూ అభిమానికి బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ క్లాస్ పీకాడు. టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యత సాధించాడు. దానిని తన సినిమాల్లో సందర్భోచితంగా చూపిస్తుంటాడు. డూప్ లేకుండా స్టంట్స్ చేస్తాడని టైగర్ ష్రాఫ్ కు పేరుంది. టైగర్ ష్రాఫ్ హీరోగా 2016లో వచ్చిన ‘ఫ్లయింగ్‌ జాట్‌’ సినిమాలో చాలా స్టంట్లు చేశాడు. దానిని స్పూర్తిగా తీసుకున్న అమన్ అనే యువకుడు 13 అడుగుల ఎత్తున్న గోడపై నుంచి కిందికి దూకి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

 దీనిపై ‘భయాన్ని జయించాను. అంత ఎత్తు నుంచి దూకడం అందరికీ అంత సులువేం కాదు. కింద నిలబడి చూస్తే ఏమీ అనిపించదు కానీ గోడపైకి ఎక్కితేనే ఎంత భయంగా ఉంటుందో తెలుస్తుంది. నాకు నేనే సూపర్‌ హీరోలా ఫీలవుతూ కిందికి దూకేశాను. నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు టైగర్‌ ష్రాఫ్‌’ అంటూ తను చేసిన స్టంట్ ను ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్ గా మారింది.

దీనిని చూసిన టైగర్‌ ష్రాఫ్ వెంటనే ట్విట్టర్ మాధ్యమంగా స్పందించాడు. ‘నువ్విలా చేయడం మూర్ఖంగా ఉంది. నీ జీవితాన్ని ఎప్పుడూ ఇలా రిస్క్‌ చేయకు. హీరోలు ఇలాంటి స్టంట్లు చేస్తున్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇంకెప్పుడూ సొంతంగా ఇలాంటి విన్యాసాలు చేయద్దు’ అంటూ క్లాస్ పీకాడు. అమన్ వీడియో చూడండి

tiger shroff
actor
Bollywood
aman
fan
stunt
  • Error fetching data: Network response was not ok

More Telugu News