lalu prasad yadav: 'ఇదేనా మీ ధైర్యం?' అంటూ లాలూకు చురకలు వేసిన నితీష్!

  • లాలూకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉపసంహరించుకున్న కేంద్రం
  • కేంద్రంపై లాలూ విమర్శలు
  • లాలూను ప్రశ్నిస్తూ నితీష్ ట్వీట్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్ మాధ్యమంగా చురకలంటించారు. లాలూకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని కేంద్ర హోం శాఖ ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పలు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన నితీష్ కుమార్ పేరు ప్రస్తావించకుండా ట్వీట్ తో సూటిగా ప్రశ్నించారు.

దాని వివరాల్లోకి వెళ్తే... ‘స్పెషల్‌ సెక్యూరిటీ గార్డులతో రాష్ట్ర ప్రభుత్వం మీకు జడ్‌ ప్లస్‌ భద్రత కల్పిస్తుంది. అయినా కూడా మీరు పదుల సంఖ్యలో నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు (ఎన్‌ఎస్జీ), సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మీ చుట్టూ ఉండాలని భావిస్తున్నారా? అలా అయితే మీరు ప్రజలను బెదిరించవచ్చని అనుకుంటున్నారా? ఇదేనా మీ ధైర్యం?’ అంటూ సూటిగా ప్రశ్నించారు. 

lalu prasad yadav
nitish kumar
tweet
  • Loading...

More Telugu News