deepa jayakumar: ఆమె ఎవరో తెలియదు: అమృతపై జయలలిత మేనకోడలు

  • అమృత ఎవరో నాకు తెలియదు
  • ఆమె అబద్ధం చెబుతోంది
  • అవివాహిత అయిన అత్తకు ఇలాంటి వాటితో సంబంధం లేదు

తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనని పేర్కొంటూ అమృత సారథి అనే యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటీషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించి, బెంగళూరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. కాగా, దీనిపై జయలలిత మేన కోడలు దీపా జయకుమార్‌ మాట్లాడుతూ, అమృత సారథి ఎవరో తనకు తెలియదన్నారు.

అవివాహిత అయిన తన అత్తకు ఇలాంటి వాటితో సంబంధంలేదని చెప్పిన ఆమె, అమృత అబద్ధమాడుతోందని అన్నారు. ఆమె చెప్పిన విషయాలు ఆశ్చర్యం కలిగించాయని తెలిపారు. జయలలిత మృతితో ఖాళీగా ఉన్న ఆర్కే నగర్‌ ఉప ఎన్నికలో తాను పోటీ చేస్తున్నానని నిర్ధారించారు. జయలలిత వేద నిలయం, పోయెస్‌ గార్డెన్‌ లను ఆమె స్మారక కేంద్రాలుగా మార్చేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతుండడాన్ని వ్యతిరేకిస్తూ సీఎస్ ను కలిశానని ఆమె వెల్లడించారు.
 

deepa jayakumar
amritha
Tamilnadu
jayalalitha
  • Loading...

More Telugu News