google: త‌క్కువ డేటా వాడుకునే 'యూట్యూబ్ గో'... భార‌త్‌లో విడుద‌ల‌

  • అధికారికంగా విడుద‌ల చేసిన యాప్‌
  • ఇంట‌ర్నెట్ నెమ్మ‌దిగా ఉన్నా వీడియోలు చూడొచ్చు
  • యాప్ మెమొరీ కూడా త‌క్కువే

డేటా త‌క్కువ‌గా ఉన్నా, ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ నెమ్మ‌దిగా వున్నా యూట్యూబ్‌లో వీడియోలు బ‌ఫ‌ర్ అవుతూ ఉంటాయి లేదా అస‌లు ప్లే కావు. అలాగే అన్ని చోట్లా 3జీ లేదా 4జీ క‌నెక్ష‌న్ అందుబాటులో ఉండ‌దు. అలాంటి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌మే 'యూట్యూబ్ గో' యాప్. ఇప్ప‌టివ‌ర‌కు దీని బీటా వెర్ష‌న్ మాత్ర‌మే భార‌త్‌లో అందుబాటులో ఉంది. అయితే ప్ర‌స్తుతం బీటా వెర్ష‌న్‌ను తీసేసి అధికారిక వెర్ష‌న్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం ప్ర‌త్యేకంగా ఈ యాప్‌ను రూపొందించారు.

అయితే ఈ యాప్‌కి సంబంధించి ఇంకా ఫైన‌ల్ వెర్ష‌న్ అందుబాటులోకి రావాల్సి ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో దీనిని వెతికిన‌పుడు 'అన్‌రిలీజ్డ్ వెర్ష‌న్‌' అని హెచ్చ‌రిక క‌నిపించింది. కావాలంటే డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు కానీ స‌రిగా ప‌నిచేయ‌క‌పోవ‌చ్చు అని సూచ‌న కూడా ఉంది. ఇంకా ఐఓఎస్ ఫోన్ల‌కు ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. యూట్యూబ్ గో ద్వారా డేటా సేవ్ చేసుకోవ‌చ్చు, డేటా అవ‌స‌రం లేకుండానే వీడియోల‌ను షేర్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా ఏ వీడియోకు ఎంత డేటా అవ‌స‌ర‌మో కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. త‌ద్వారా ముఖ్య‌మైన వీడియోల‌ను త‌క్కువ రిజ‌ల్యూష‌న్‌తో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం క‌లుగుతుంది. ఈ యాప్ మెమొరీ కూడా చాలా త‌క్కువ‌.

  • Loading...

More Telugu News