manchu lakshmi: నా కూతురును చూసి ఎంతో గర్వపడుతున్నా: మోహన్ బాబు

  • జీఈ సదస్సులో ప్రసంగించనున్న మంచు లక్ష్మి
  • కూతురుని చూసి గర్విస్తున్నానన్న మోహన్ బాబు
  • లక్ష్మికి మరింత శక్తి చేకూరాలంటూ ఆకాంక్షించిన తండ్రి

ప్రతిష్ఠాత్మకమైన గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొని ప్రసంగించే అరుదైన అవకాశం ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మికి లభించింది. మహిళల్లో ఔత్సాహికత, మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొనే సవాళ్లు, వారి జీవితాల్లో సమతుల్యం వంటి అంశాలపై ఆమె ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో లక్ష్మిపై మోహన్ బాబు ప్రశంసల జల్లు కురిపించారు.

 "నా కుమార్తెను చూసి ఎంతో గర్విస్తున్నా. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో నా కుమార్తె 'ఎన్ జెండర్డ్' డైలాగ్స్ ప్యానల్ లో ఉండటం నాకు ఎంతో సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. లక్ష్మికి మరింత శక్తి చేకూరాలని... భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

manchu lakshmi
mohanbabu
Global Entrepreneurship Summit
  • Loading...

More Telugu News