hicc: పారిశ్రామికవేత్తల ప్రతిభను ప్రత్యక్షంగా వీక్షించిన ఇవాంకా, మోదీ

  • హెచ్ఐసీసీలో పారిశ్రామిక వేత్తల ప్రాడక్టులు
  • వివిధ టెక్నాలజీ పరికరాలు స్వయంగా వీక్షణ
  • వివిధ ప్రాడక్టులపై వివరణ

హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రతిభను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా వీక్షించారు. పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన టెక్నాలజీని వీరు పరిశీలించారు.

పలు యాప్ లు, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ, సరికొత్త ఆడియో డివైజ్ లు తదితర సరికొత్త సాంకేతిక హంగులను వీక్షించారు. ఈ సందర్భంగా వాటి తయారీ దారులు వాటి గురించి వివరించారు. అలాగే పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ప్రాడక్టులను పరిశీలించారు. వివిధ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

  • Loading...

More Telugu News