debris: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చుట్టూ వున్న చెత్తా చెదారాన్ని పసిగట్టే సెన్సార్!
- డిసెంబర్ 3న స్పేస్ ఎక్స్ ద్వారా పంపనున్న నాసా
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఢీకొట్టకుండా అరికట్టే సెన్సార్
- ప్రమాదాల గురించి ముందే హెచ్చరించే సెన్సార్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) చుట్టూ వున్న చెత్తా చెదారాన్ని పసిగట్టి హెచ్చరించే ఓ సెన్సార్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపించనుంది. ఈ సెన్సార్ సహాయంతో ఐఎస్ఎస్ కక్ష్యలో అడ్డంగా ఉన్న అంతరిక్ష చెత్తను ముందే గుర్తించవచ్చు. దీని ద్వారా ఐఎస్ఎస్‌ను ఆ చెత్త ఢీకొట్టకుండా అరికట్టవచ్చు. డిసెంబర్ 4న స్పేస్ ఎక్స్ కార్గో ద్వారా ఈ స్పేస్ డెబ్రి సెన్సార్ (ఎస్‌డీఎస్)ను ఐఎస్ఎస్‌కి పంపించనున్నారు.