hicc: హెచ్ఐసీసీలో పండగ వాతావరణం... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సందడి!
- హెచ్ఐసీసీలో ప్రారంభమైన సదస్సు
- కొలువుదీరిన పారిశ్రామిక వేత్తలు
- వివిధ అంశాలపై చర్చ
హైదరాబాదు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో పండగ వాతావరణం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన వ్యక్తిగత సలహాదారు ఇవాంకా ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన పారిశ్రామిక వేత్తలతో పాటు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హెచ్ఐసీసీలో కొలువుదీరారు.
అందరూ ఎదురుచూస్తున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ ప్రారంభమైంది. ఇందులో వివిధ సెషన్లలో పారిశ్రామిక రంగంలో కొత్తకొత్త ఆలోచనలు, విధానాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు అనుభజ్ఞుల సలహాలు తీసుకోనున్నారు. ప్రధానంగా పారిశ్రామిక రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల సాధికారతపై చర్చ జరగనున్నట్టు సమాచారం.