hicc: మోదీని చూడడానికి మియాపూర్ మెట్రోస్టేషన్‌కు పెద్ద ఎత్తున స్థానికులు.. హెచ్‌ఐసీసీకి బయలుదేరిన ప్రధాని
- రేపు ఉదయం నుంచి మెట్రో రైలు సేవలు
- కాసేపట్లో ఇవాంక ట్రంప్‌తో మోదీ భేటీ
- అనంతరం సదస్సు ప్రారంభం
హైదరాబాదీయుల కలలబండి మెట్రోరైల్‌ను ప్రారంభించిన అనంతరం గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మెట్రోరైల్‌లో ప్రయాణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనడానికి హెచ్ఐసీసీకి హెలికాప్టర్‌లో బయలుదేరారు.
ఇక మోదీని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున మియాపూర్ మెట్రోస్టేషన్ పరిసర ప్రాంతాల్లోకి వచ్చారు. హెచ్ఐసీసీలో మొదట ఇవాంక ట్రంప్‌తో మోదీ సుమారు 20 నిమిషాల పాటు సమావేశం అవుతారు. అనంతరం సదస్సును ప్రారంభిస్తారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించడమే ప్రధానంగా ఈ సదస్సు జరగనుంది.
కాగా, తొలిదశలో హైదరాబాద్ మెట్రోరైల్ 30 కిలోమీటర్ల మేర పరుగులు తీయనుంది. రేపు ఉదయం నుంచి హైదరాబాదీయులు మెట్రోరైల్ సేవలను ఉపయోగించుకోవచ్చు.