meghan markel: మేఘ‌న్ మార్కెల్ కోసం ఎంగేజ్‌మెంట్ రింగ్‌ని డిజైన్ చేసిన‌ ప్రిన్స్ హ్యారీ

  • ఉంగ‌రంలో డ‌యానా ధ‌రించిన వ‌జ్రాలు
  • ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన మేఘ‌న్ మార్కెల్‌
  • పెళ్లి ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇంట‌ర్వ్యూ ఇచ్చిన జంట‌

ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌లకు నిశ్చితార్థం జ‌రిగింద‌ని, వ‌చ్చే ఏడాది పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని ప్ర‌క‌ట‌న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. అందులో వారి నిశ్చితార్థానికి సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. ఎంగేజ్‌మెంట్ రోజు ఆమె ధ‌రించిన ఉంగ‌రాన్ని ప్రిన్స్ హ్యారీ డిజైన్ చేసిన‌ట్లు మేఘ‌న్ మార్కెల్ వెల్ల‌డించింది.

మూడు డైమండ్లు పొదిగిన ఈ ఉంగ‌రంలో రెండు వ‌జ్రాలు ప్రిన్స్ హ్యారీ త‌ల్లి డ‌యానా ధ‌రించిన‌వి కాగా, ఇంకొక‌టి బోట్స్‌వానా నుంచి తీసుకువ‌చ్చింది. వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన కొత్త‌లో మొద‌టిసారి ఐదు రోజులు బోట్స్‌వానా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అక్క‌డే వీరి బంధం బాగా గ‌ట్టిప‌డింది. ఈ ఉంగ‌రాన్ని క్వీన్ ఎలిజ‌బెత్ -2 అధికారిక ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ‌  క్లీవ్ అండ్ కంపెనీ త‌యారుచేసింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News