ivanka trump: ఇవాంకాపై ఐఎస్ఐఎస్ గురి... ఇజ్రాయెల్ రక్షణ పరికరాలతో భద్రత ఏర్పాట్లు!

  • హెచ్చరించిన యూఎస్ సీక్రెట్ సర్వీస్
  • బులెట్ ప్రూఫ్ కారులోనే ఇవాంకా ప్రయాణాలు
  • అయినా అన్ని చర్యలూ చేపట్టిన కేంద్ర, రాష్ట్ర బలగాలు
  • ఐఎస్ఐఎస్ సానుభూతి పరులపై నిఘా

ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై దాడి చేసేందుకు ఐఎస్ఐఎస్ ప్రణాళికలు వేస్తోందని అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారుల నుంచి అందిన సమాచారంతో ఇజ్రాయిల్ రక్షణ పరికరాలను రంగంలోకి దింపారు. ఇప్పటికే సదస్సుకు భద్రతగా 10,400 మంది పోలీసులను తెలంగాణ సర్కారు మోహరించగా, 8 మంది యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు అనుక్షణం ఇవాంక చుట్టూ పహారా కాస్తున్నారు.

నగరంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న అనుమానం ఉన్న 200 మందిపై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ ప్రత్యేక నిఘా పెట్టింది. ఇవాంకకు భద్రత కల్పించేందుకు ఇజ్రాయిల్ నుంచి తెప్పించిన విధ్వంసక వ్యతిరేక, యాంటీ ఎక్స్ ప్లోజివ్ ప్రత్యేక పరికరాలను హెచ్ఐసీసీ, ఫలక్ నుమా, ట్రైడెంట్ హోటల్ వద్ద ఉంచారు. వీటికితోడు ఆమె ఉన్న ప్రాంతాలపై శాటిలైట్ నిఘా పెట్టారు. క్లోజ్ డ్ ప్రొటెక్షన్ టీమ్ మధ్య బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఇవాంకా ప్రయాణాలు సాగనున్నప్పటికీ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి.

ivanka trump
telangana
GES
israel
  • Loading...

More Telugu News