kotamreddy sridhar reddy: గన్ మెన్లను మరోసారి నిరాకరించిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి!

  • ఇప్పటికే మూడుసార్లు గన్ మెన్లను తిప్పి పంపిన కోటంరెడ్డి
  • నిన్న మరోసారి గన్ మెన్ల కేటాయింపు, తిరస్కరణ 
  • ప్రజలే అండ అని పేర్కొన్న ఎమ్మెల్యే 

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను మరోసారి తిరస్కరించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజే శ్రీధరరెడ్డికి పోలీసు భద్రతా విభాగం గన్ మెన్లను కేటాయించింది. అయితే, తనకు గన్ మెన్లు అవసరం లేదంటూ అప్పట్లోనే జిల్లా ఎస్పీకి ఆయన లేఖ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో మరో రెండు సార్లు గన్ మెన్లను కేటాయించగా... అప్పుడు కూడా తిప్పి పంపారు.

 తాజాగా, నిన్న కూడా ఇద్దరు గన్ మెన్లను పోలీసు విభాగం కేటాయించింది. పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్న తరుణంలో భద్రత తప్పనిసరి అంటూ పోలీసులు కోటంరెడ్డికి స్పష్టం చేశారు. అయితే, తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని పేర్కొంటూ డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, జిల్లా ఎస్పీకి ఆయన లేఖలు రాశారు. తనకు పోలీసు భద్రత అవసరం లేదని, ప్రజలే కొండంత అండ అని ఆయన తెలిపారు. 

kotamreddy sridhar reddy
YSRCP
nellore rural mla
  • Loading...

More Telugu News