Donald Trump: ఔత్సాహిక సదస్సుకు అనుకోని అతిథి... డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం కూడా!

  • నేటి నుంచి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొననున్న డొనాల్డ్ ట్రంప్
  • ఔత్సాహికులను ప్రోత్సహించేలా కాసేపు ప్రసంగం

దక్షిణాసియాలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరగనుండగా, ఈ సదస్సును ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రసంగించనున్నారు. సదస్సుకు హాజరైన వారిని ఉద్దేశించి ట్రంప్ వీడియో ప్రసంగం ఉంటుందని, తన కుమార్తెతో పాటు అతిథులను చూస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రంప్ మాట్లాడతారని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వెల్లడించారు.

ఆయన ప్రసంగం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుందని, ఔత్సాహికులను ప్రోత్సహించేదిగా సాగుతుందని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ సదస్సుకు ఇవాంకా ప్రత్యక్షంగా హాజరై, మాట్లాడనుండగా, ఆమె తండ్రి అమెరికా అధ్యక్ష హోదాలో మాట్లాడనుండటం అదనపు ఆకర్షణ. కాగా, 2012లో ఇదే సదస్సు దుబాయ్ లో జరుగగా, అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా వీడియో మాధ్యమంగా ప్రసంగించారు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే పని చేస్తుండటం గమనార్హం.

Donald Trump
ivanka trump
Hyderabad
  • Loading...

More Telugu News