giddi eshwari: వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడ డ్యామ్ ష్యూర్ గా గెలిచేది వైకాపాయే... టీడీపీలో చేరిన తరువాత గిడ్డి ఈశ్వరి సంచలన వ్యాఖ్యల వీడియో!

  • గతంలో అధిక మెజారిటీ వచ్చిన నియోజకవర్గాలు పాడేరు, అరకు
  • 2019లో కూడా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే
  • మిగతా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో చెప్పలేను
  • వైరల్ అవుతున్న గిడ్డి ఈశ్వరి వీడియో

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి, మీడియాతో మాట్లాడుతున్న వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు.

"గతంలో పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. అలాగే, రేపు 2019లో కూడా కచ్చితంగా రాష్ట్రమంతా ఏం జరుగుతుందో నాకు తెలియదుగానీ, పాడేరు, అరకు మాత్రం డ్యామ్ ష్యూర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నేను చెప్పగలను.." అని మాట్లాడారు.

గిడ్డి ఈశ్వరి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్ అయింది. పాడేరు, అరకులో వైఎస్ఆర్ పార్టీ పాతుకు పోయిందని, అందుకు తాను కూడా కారణమేనని చెప్పారు. ఆ తరువాత మాత్రం సర్దుకుని తన ప్రసంగాన్ని సవరించుకుని, జగన్ పై విమర్శలు గుప్పించారు. గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యల వీడియోను మీరూ చూడవచ్చు.

giddi eshwari
YSRCP
Jagan
Chandrababu
  • Error fetching data: Network response was not ok

More Telugu News