Hyderabad: ఇవాంకా సదస్సు ఖర్చు 8 కోట్లు?

  • ట్రాన్స్ పోర్టుకు ఎక్కువ ఖర్చు 
  • ఫలక్ నుమా, గోల్కండ కోట విందు ఖర్చులు అదనం 
  • నగర ముస్తాబు, రోడ్ల మరమ్మతుల ఖర్చు కూడా వుంది 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా ట్రంప్ సదస్సును విజయవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

 ఫలక్ నుమా ప్యాలెస్ లో ఈ నెల 28న ప్రధాని విందు జరగనుండగా, 29న గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం విందునివ్వనుంది. తెలంగాణ ప్రభుత్వమిచ్చే విందుకు మోదీ, ఇవాంకా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేవలం సదస్సు నిర్వహణ, అతిథుల బస, భోజనాలు, ట్రాన్స్ పోర్టుకు 8 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక ఫలక్ నుమా, గోల్కండ కోట విందు ఖర్చులు అదనం. ఇదే కాకుండా విదేశీ అతిథులు ఉండేందుకు 287 గదులున్న నోవోటెల్ హోటల్ ను బుక్ చేశారు. అలాగే హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ లోని వెస్టిన్ హోటల్, రహేజా ఐటి పార్క్ లను కూడా రిజర్వు చేశారని తెలుస్తోంది. అంతే కాకుండా నగరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు, కొత్తగా రోడ్లు వేసేందుకు అయిన మొత్తం తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News