pavan kalyan: పవన్ నుంచి నేర్చుకున్నది నిజాయతీ .. మంచితనం: శివబాలాజీ

  • పవన్ తో కలిసి పని చేసిన రోజులను మరిచిపోలేను
  • ఆయన మాటలన్నీ మనసులో నుంచే వస్తాయి 
  • ఆయనతో పరిచయమున్న వాళ్లంతా ఇదే మాట చెబుతారు    

"పవన్ కల్యాణ్ ధోరణి మిగతా హీరోలకి కాస్త భిన్నంగా కనిపిస్తూ వుంటుంది. అలాంటి పవన్ కల్యాణ్ తో 'కాటమరాయుడు' సినిమాలో ఆయనకి ఒక బ్రదర్ గా చేశారు. సాధారణంగా పవన్ తో పనిచేసిన వాళ్లంతా ఫలానా విషయం నేర్చుకున్నామని  చెబుతుంటారు. ఆయనతో 60 రోజుల పాటు జర్నీ చేసిన మీరు ఏం నేర్చుకున్నారు?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ నుంచి శివబాలాజీకి ఎదురైంది.

అప్పుడాయన స్పందిస్తూ .. " కల్యాణ్ గారితో కలిసి పని చేసిన రోజులను ఎప్పటికీ మరిచిపోలేను. జీవితంలో ఎప్పుడైనా వెనక్కి వెళ్లాలనిపిస్తే, ఆ రోజులకి వెళ్లాలనుకుంటాను. ఆయన మాట్లాడే ప్రతిమాట ఆయన మనసు నుంచే వస్తుంది. పవన్ మాటలు ఆయన హృదయానికి దగ్గరగా ఉంటూ .. ఎదుటివారి హృదయాలను తాకుతాయి. ఆయన నుంచి ముందుగా నేర్చుకోవలసింది నిజాయతీ. ఆ తరువాత ఆయనలో మనకి కనిపించేది మంచితనం. ఆయన నుంచి నేను నేర్చుకున్నవి ఇవే. నేనే కాదు ..  ఆయనతో పరిచయమున్న వాళ్లంతా ఈ మాట తప్పకుండా చెబుతారు" అంటూ స్పష్టం చేశాడు.         

pavan kalyan
shivabalaji
  • Loading...

More Telugu News