yoga: యోగాకు కొత్త అర్థం తీసుకువస్తున్న ఫ్లైయింగ్ బర్డ్ యోగా!
- గాల్లో వ్రేలాడుతూ యోగా
- మానసిక సమస్యలు దూరం
- చేయడం కొంచెం కష్టమే
యోగా.. భారత ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యాయామ ప్రక్రియ. యోగా అందం మొత్తం దాన్ని చేసే విధానాల్లోనే ఉంది. ఒద్దిక, ప్రత్యేకత ఎంతో అవసరం. ఇటీవల వచ్చిన 'ఫ్లైయింగ్ బర్డ్ యోగా' ఈ కోవకే చెందుతుంది. దీన్ని 'ఏరియల్ యోగా' అని కూడా అంటారు. దీంతో యోగా వల్ల కలిగే ఫలితాలతో పాటు వినూత్న రీతిలో యోగా చేసేందుకు అవకాశం కలుగుతుంది.
మామూలు యోగా అంత సులభంగా ఇది ఉండదు. పై నుంచి వేలాడదీసిన వస్త్రంలో పడుకుని ఈ యోగా చేయాలి. ఫ్లైయింగ్ బర్డ్ యోగా చేయాలంటే చాలా శక్తి కావాలి. ఊర్థ్వ శరీర భాగాలను నియంత్రించుకోగల సామర్థ్యం ఉండాలి. ఈ యోగా చేయడం వల్ల కండరాలు, కీళ్లు బలిష్టంగా తయారవుతాయి. వెన్నెముక సమస్యలు కూడా దరిచేరవు. ఒత్తిడి కూడా దూరమవుతుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తి పెరగడం, హృద్రోగాలు, జీర్ణాశయ రోగాలు కూడా రావు. ఈ యోగా పద్ధతిని హైదరాబాద్‌లోని అక్షర్ యోగ వారు అందుబాటులోకి తీసుకువచ్చారు.