rekhaben chaudary: ఎన్నికల ముందు గుజరాత్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ

  • కాంగ్రెస్ కు రేఖాబెన్ చౌదరి
  • కారణం వెల్లడించని రేఖ
  • కాంగ్రెస్ కు ఎదురుదెబ్బే అంటున్న విశ్లేషకులు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు డిసెంబర్ 9న మొదటి దశ, 14న రెండో విడత పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ గుజరాత్ అధికార ప్రతినిధి రేఖాబెన్ చౌదరి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేయడమేకాక, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు.

టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి కారణంగానే ఆమె రాజీనామా చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ... కారణమేంటో ఆమె అధికారికంగా ప్రకటించలేదు. ఈమె రాజీనామా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగానే భావిస్తున్నారు. మరోవైపు బీజేపీకి కూడా రాజీనామాల తలనొప్పులు తప్పలేదు. మాజీ ఎంపీ కాజిభాయ్ పటేల్, ఆయన కుమారుడు సునీల్ పటేల్ తో కలసి రెండ్రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.

rekhaben chaudary
gujarath congress
BJP
  • Loading...

More Telugu News