chateswar pujara: కోహ్లీ చెలరేగిపోతుండటానికి కారణం ఇదే: పుజారా

  • అంతులేని ఆత్మ విశ్వాసమే కోహ్లీ విజయానికి కారణం
  • కోహ్లీలా ఇతరులు ఆడటం అంత ఈజీ కాదు
  • దక్షిణాఫ్రికా పర్యటనలో రాణిస్తా

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అతనిపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే టెస్టులో సెంచరీ చేసిన చటేశ్వర్ పుజారా కూడా కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. కోహ్లీలా ఇతరులు ఆడటం అంత ఈజీ కాదని పుజారా స్పష్టం చేశాడు.

కెరీర్ ఆరంభంలోనే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో రాణించాడని... ఇతర క్రికెటర్లు ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదని చెప్పాడు. అంతులేని ఆత్మవిశ్వాసమే కోహ్లీ విజయానికి కారణమని తెలిపాడు. గత మూడేళ్ల నుంచి కోహ్లీ ప్రదర్శన తార స్థాయికి చేరుకుందని... అతను కొనసాగిస్తున్న స్ట్రైక్ రేట్ ను కొనసాగించడం ఇతర ఆటగాళ్లకు అంత సులభం కాదని అన్నాడు. బ్యాటింగ్ కు ఏమాత్రం అనుకూలించని నాగపూర్ పిచ్ పై అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు సాధించామని చెప్పాడు.

తన వరకు వస్తే... గత రెండేళ్లుగా ఫిట్ నెస్ పై దృష్టి సారించానని పుజరా తెలిపాడు. ఫిట్ నెస్ కారణంగానే తాను గంటల సేపు క్రీజులో ఉండగలుగుతున్నానని చెప్పాడు. దీనికి తోడు కౌంటీ క్రికెట్, గత అనుభవాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. విదేశాల్లో రాణించాలన్న తపనతోనే బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంచుకున్నానని... దక్షిణాఫ్రికా పర్యటనలో రాణిస్తానని చెప్పాడు.

chateswar pujara
Virat Kohli
team india
  • Loading...

More Telugu News