jayaprada: చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించిన సినీ నటి జయప్రద

  • రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారు
  • కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలి
  • ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు 

ఏపీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని మాజీ ఎంపీ, ప్రముఖ సినీ నటి జయప్రద అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కితాబిచ్చారు. అయితే, విభజన హామీల మేరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మరింత సహకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ఆరోగ్యం, ఉపాధి, విద్య, మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర సాయం చాలా అవసరమని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాను కేంద్రం పక్కన పెట్టడం దారుణమని... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని చెప్పారు.

కొత్త రాజధానిని నిర్మించడం సామాన్యమైన విషయం కాదని, అన్ని అవసరాలను సమకూర్చుకోవాల్సి ఉంటుందని, అందువల్ల కేంద్రం అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉందని జయప్రద అన్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని... త్వరలోనే రాజకీయ భవతవ్యంపై ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు ఓ రాజకీయ లక్ష్యం ఉందని... ప్రస్తుతానికైతే తన మనసులోని మాటను బయటపెట్టబోనని తెలిపారు. ఏ పార్టీలో చేరబోతున్నానన్న సంగతిని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. అవార్డుల గురించి స్పందిస్తూ, సమాజానికి ఉపయోగపడే సినిమాలకే అవార్డులు వస్తాయని తెలిపారు.

jayaprada
Chandrababu
special status
  • Loading...

More Telugu News