ivanka trump: ఇవాంక ట్రంప్ కు గిఫ్ట్ ను సెలెక్ట్ చేసిన సమంత!

  • ఇవాంక కానుకల జాబితాలో 'గొల్లభామ' చేనేత చీర
  • కొన్ని డిజైన్లను ఎంపిక చేసిన సమంత
  • అందులో ఇవాంకకు కానుకగా ఒక చీర

హైదరాబాద్ లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కోసం హైదరాబాద్ నగరం అందంగా ముస్తాబైంది. మరోవైపు ఆమెకు సిద్ధిపేట కానుక కూడా రెడీ అయింది. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే అందమైన గొల్లభామ చేనేత చీరలను ఇవాంకకు కానుకగా ఇవ్వనున్నారు. ఇవాంకకు అందించే కానుకల జాబితాలో గొల్లభామ చీర కూడా చేరింది.

 సిద్ధిపేట ప్రాంతంలో ఈ చీరలను గత 50 ఏళ్లుగా తయారు చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఈ చీరల తయారీని ప్రోత్సహిస్తుండమేకాక, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కూడా ఎంతో కృషి చేస్తున్నారు. టీఎస్ చేనేత బ్రాండ్ అంబాసడర్, సినీ నటి సమంత కూడా ఈ చీరలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇవాంక కోసం ఆమె కొన్ని డిజైన్లను సెలెక్ట్ చేసింది. ఇందులో నుంచే ఒక చీరను ఎంపిక చేసి, ఇవాంకకు అందించనున్నారు.

ivanka trump
samantha
Harish Rao
gollabhama sarees
sidhipet sarees
  • Loading...

More Telugu News