Supreme Court: భార్యతోనే ఉండాలని న్యాయస్థానం ఒత్తిడి చేయలేదు: సుప్రీంకోర్టు కీలక రూలింగ్

  • కాపురం మానవ సంబంధాలకు సంబంధించిన విషయం 
  • ముందస్తు బెయిల్ పునరుద్ధరణ 
  • తమిళనాడు పైలెట్ గృహహింస కేసులో సుప్రీం వ్యాఖ్య 

కాపురం చేయడమన్నది మానవ అనుబంధాలకు సంబంధించిన విషయమని, భార్యతోనే ఉండాలని భర్తను కోర్టులు ఒత్తిడి చేయజాలవని ఓ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, తమిళనాడుకు చెందిన ఓ పైలెట్‌ పై గృహ హింస కేసు దాఖలు కాగా, అతనికి ఉన్న ముందస్తు బెయిల్ ను మధురై హైకోర్టు బెంచ్ రద్దు చేసింది. దీనిపై సదరు పైలెట్ సుప్రీంను ఆశ్రయించగా, జస్టిస్‌ ఆదర్శ్‌ గోయల్, జస్టిస్‌ యుయు లలిత్‌ల ధర్మాసనం కేసును విచారించింది.

 భార్యా పిల్లల పోషణ నిమిత్తం నెల రోజుల్లోగా రూ.10లక్షలు చెల్లించాలని, ఈ మొత్తాన్ని ఆమె షరతులు పెట్టకుండా తీసుకోవాలని ఆదేశించింది. తన భర్త శాఖాపరమైన క్రమశిక్షణా చర్యల నుంచి తప్పించుకునేందుకు, ఉన్నతాధికారుల వద్ద భార్యా పిల్లలతో కలిసి ఉంటానని హామీ ఇచ్చాడనీ, ఆపై దాన్ని నెరవేర్చలేదని పిటిషనర్‌ కోర్టుకు విన్నవించగా, కోర్టు స్పందించింది. భార్యతోనే ఉండాలని భర్తను ఆదేశించలేమని, అతని ముందస్తు బెయిల్ ను పునరుద్ధరిస్తున్నామని, తదుపరి కేసు విచారణ ట్రయల్ కోర్టులోనే సాగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News