anchor anasuya: నాకే అంకుల్ లా ఉన్నావు... నన్ను ఆంటీ అంటావేంటి?: నెటిజన్ సంబోధనపై అనసూయ ఫైర్!

  • ఫేస్ బుక్ లో లైవ్ చాట్ చేసిన అనసూయ
  • ఆంటీ... అని సంబోధించిన ఓ అభిమాని
  • వెంటనే ఘాటుగా స్పందించిన అనసూయ

గత కొంత కాలంగా 'సచ్చిందిరా గొర్రె' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న యాంకర్, నటి అనసూయ, తాజాగా, ఫేస్ బుక్ లో లైవ్ చాటింగ్ చేస్తూ, తనను 'ఆంటీ' అని సంబోధించిన నెటిజన్ పై విరుచుకుపడ్డారు. సదరు అభిమాని, 'హాయ్ అనూ ఆంటీ..' అని కామెంట్ పెట్టడంతో అనసూయ కోపం నషాళానికి అంటినట్టుంది.

 వెంటనే ఆమె ఘాటుగా స్పందిస్తూ, "గడ్డాలు మీసాలు పెంచుకుని నాకే అంకుల్ లా ఉన్న మీరు నన్ను ఆంటీ అని పిలవడమేంటి? కాస్త చదువుకున్న వారిలా ప్రవర్తించండి" అంటూ క్లాస్ పీకింది. 'ఆంటీ' అనే పదాన్ని బూతు మాటగా మార్చేశారని, తన పిల్లల స్నేహితులు తనను 'ఆంటీ' అంటే పలుకుతానని చెప్పింది. ఈ పదం ఎక్కడ, ఎవరితో వాడాలో తెలుసుకోవాలని మండిపడింది. ఇక నాలుగు పదుల వయసులోకి వెళ్లిన అనసూయ 'ఆంటీ' కాక ఇంకేంటని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి.

anchor anasuya
aunty
face book
  • Loading...

More Telugu News