prattipati pullarao: ఏపీ మంత్రి ప్రత్తిపాటి మిల్లులో అగ్నిప్రమాదం... భారీగా ఆస్తి నష్టం!

  • గణపవరంలోని శివస్వాతి కాటన్ సీడ్ మిల్ లో ప్రమాదం
  • గుంటూరు, నరసరావుపేట, చీరాల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లు
  • మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్న అధికారులు

ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో నిర్వహిస్తున్న 'శివస్వాతి కాటన్ సీడ్ ఆయిల్ మిల్'లో ఈ ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఆపై గుంటూరు, నరసరావుపేట, చీరాల నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదని సమాచారం. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

prattipati pullarao
ganapavaram
cotton seet mill
  • Loading...

More Telugu News