Jagan: కేఈ కృష్ణమూర్తిని చూస్తే జాలి కలుగుతోంది: జగన్

  • పేరుకు మాత్రమే ఆయన డిప్యూటీ సీఎం
  • కనీసం ఒక ఆర్డీవోను కూడా బదిలీ చేయించలేకపోతున్నారు
  • హంద్రీనీవా నదికి వంతెన కూడా నిర్మించలేకపోతున్నారు

ఏపీ డిప్యూటీ సీఎం, టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తిని చూస్తే తనకు జాలి కలుగుతోందంటూ వైసీపీ అధినేత జగన్ అన్నారు. పేరుకు మాత్రమే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఉందని... కనీసం ఒక ఆర్డీవోను కూడా బదిలీ చేయించలేక పోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి తర్వాతి స్థానంలో ఉండి కూడా కోడుమూరు-పత్తికొండ నియోజకవర్గాల మధ్య హంద్రీనీవా నదికి వంతెనను నిర్మించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తాను చంద్రబాబులాంటి వ్యక్తిని కాదని... ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు.

Jagan
YSRCP
ke krishnamutry
ap deputy cm
handri neeva
Chandrababu
jagan padayatra
  • Loading...

More Telugu News