Narendra Modi: మోదీ హైదరాబాద్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు!

  • బేగంపేటలో బీజేపీ కార్యక్రమంలో పాల్గొననున్న పీఎం
  • 15 నిమిషాల పాటు సమావేశం
  • అనంతరం యథావిధిగా కొనసాగనున్న షెడ్యూల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన షెడ్యూల్ లో స్వల్ప మార్పు జరిగింది. ఇంతకు ముందు షెడ్యూల్ ప్రకారం 28 మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆయన నేరుగా మియాపూర్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వెళ్లాలి.

అయితే, మారిన షెడ్యూల్ ప్రకారం బేగంపేటలో దిగగానే ఆయన 15 నిమిషాల పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్ లో మియాపూర్ వెళ్తారు. బేగంపేటలో జరగనున్న కార్యక్రమానికి 3 వేల మంది హాజరయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మియాపూర్ మెట్రో ప్రారంభోత్సవం అనంతరం ఆయన షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది. హెచ్ఐసీసీలో జరిగే సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. 

Narendra Modi
Prime Minister
pm hyderabad tour
  • Loading...

More Telugu News