Hyderabad: హైద‌రాబాద్‌ మెట్రోరైల్ స్మార్ట్‌కార్డుల‌ను అందుకుని మురిసిపోయిన న‌గ‌ర‌వాసులు!

  • ఎల్లుండి మెట్రోరైల్ తొలిద‌శ ప్రారంభం
  • మెట్రో స్మార్ట్‌కార్డు ధర రూ.200
  • కార్డులో గరిష్ఠంగా రూ.2వేల వరకు రీఛార్జి చేసుకోవ‌చ్చు
  • మెట్రో టికెట్ ధ‌ర‌లో 5 శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు

హైద‌రాబాదీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రోరైల్‌ను ఎల్లుండి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ మ‌రుసటి రోజు నుంచే నాగోల్ నుంచి మియాపూర్ వ‌ర‌కు తొలిద‌శ మెట్రోరైల్ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు అందుతాయి. మెట్రోరైల్‌లో ప్రయాణించే వారి కోసం మెట్రోస్మార్ట్‌ కార్డులను ఈ రోజు నుంచి విక్ర‌యిస్తున్నారు. మొద‌ట న‌గ‌రంలోని నాగోల్‌, తార్నాక, ప్రకాశ్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌ మెట్రో స్టేషన్లలో ఈ కార్డులను అమ్ముతున్నారు.

ఈ కార్డులు పొందిన వారు వాటితో ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. డెబిట్, క్రెడిట్ కార్డు సైజులోనే ఈ కార్డులు ఉన్నాయి. వీటిని ఉప‌యోగించి మెట్రోరైల్ ఛార్జీల్లో ఐదు శాతం డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. ఈ మెట్రో స్మార్ట్‌కార్డు ధర రూ.200. అందులో రూ.100 ధరావతు కింది జమ అవుతుంది. మిగ‌తా రూ.100 కార్డులో రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఈ కార్డులో గరిష్ఠంగా రూ.2వేల వరకు రీఛార్జి చేసుకోవ‌చ్చు. గడువు ముగిశాక‌ తిరిగి రెన్యువల్‌ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News