ivanka trump: 'ఇవాంకా... మా వీధిలోకి రండి' అన్న హైదరాబాదీ అభ్యర్థనకు స్పందించిన ట్రంప్ కుమార్తె!

  • మణికొండ వ్యక్తికి సమాధానం ఇచ్చిన ఇవాంక
  • రోడ్ల నిర్మాణంపై మోదీతో మాట్లాడతానని వెల్లడి
  • సోషల్ మీడియాలో పోస్టుల వెల్లువ

హైదరాబాద్ లో రోడ్ల దుస్థితి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక వరకూ వెళ్లింది. ఇక్కడ రహదారుల స్థితి అసలు బాగాలేదని, కేవలం మీరు పర్యటించే రహదారులను మాత్రమే అందంగా మారుస్తున్నారని ఆమెకు ఫిర్యాదులు అందగా, ఇవాంక సైతం స్పందించింది. ఇవాంక వాట్స్ యాప్ కు హైదరాబాదీలు మెసేజ్ లు పెడుతుండగా, ఆమె స్పందించినట్టు తెలుస్తోంది.

తాను మణికొండలో నివాసం ఉంటున్నానని, మీరు ఓ దఫా తమ రోడ్లపై ప్రయాణిస్తే బాగుంటుందని, తమకు కొత్త రహదారులు వస్తాయని ఓ వ్యక్తి ఆమె ఖాతాకు మెసేజ్ పెట్టగా, రోడ్ల నిర్మాణంపై తాను భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ఇవాంక సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సదరు వ్యక్తి, అప్పుడిక తనపై రోడ్ సర్వీస్ టాక్స్ పేరిట కొత్త పన్ను పడుతుందని వ్యాఖ్యానించాడట. కాగా, ఇవాంక తమ ప్రాంతం గుండా వెళ్లాలని అభ్యర్థిస్తున్న వారు ఎందరో సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ivanka trump
Narendra Modi
roads in hyderabad
  • Loading...

More Telugu News