jayalalitha: జయలలిత, శశికళపై ‘శశిలలిత’ పేరుతో సినిమా తీస్తా: కేతిరెడ్డి మ‌రో ప్రకటన‌

  • ఇప్ప‌టికే  కేతిరెడ్డి చేతిలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా
  • రెండు భాగాలుగా ‘శశిలలిత’ సినిమా
  • మొదటి భాగంలో జయలలిత, శశికళ పాత్రలు
  • రెండవ భాగంలో ఆసుప‌త్రిలో జయలలిత చేరిన సంఘ‌ట‌న‌లు

‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అంటూ ఎన్టీఆర్ జీవితంలో ప‌లు సంఘ‌ట‌న‌లను ప్రస్తావిస్తూ సినిమా తీస్తోన్న నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌‌రెడ్డి మ‌రో ప్ర‌క‌ట‌న చేశారు. త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త‌ జయలలిత, ఆమె స‌న్నిహితురాలు శశికళపై ‘శశిలలిత’ పేరుతో సినిమా తీస్తానని తెలిపారు. ఈ సినిమా పార్ట్‌-1, పార్ట్‌-2గా తీస్తామని మొదటి భాగంలో జయలలిత, శశికళ పాత్రలు..  రెండవ భాగంలో ఆసుప‌త్రిలో జయలలిత చేరిన నేప‌థ్యంలో జ‌రిగిన పరిణామాల‌పై సినిమా ఉంటుంద‌ని తెలిపారు. ఓవైపు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాపై వివాదం నెల‌కొంటే, మ‌రోవైపు మ‌రో వివాదాస్పద కథతో కూడా సినిమా తీస్తాన‌ని కేతిరెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.     

jayalalitha
shashikala
kethireddy
  • Loading...

More Telugu News