Jagan: 2019 అసెంబ్లీ ఎన్నికల తొలి అభ్యర్థిని ప్రకటించిన జగన్!
- కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీదేవి
- ఇక శ్రీదేవి భవిష్యత్తుని ప్రజల చేతిలో పెడుతున్నా-జగన్
- గత ఎన్నికల్లో పత్తికొండ నుంచి గెలుపొందిన కేఈ కృష్ణమూర్తి
ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి స్థానిక నాయకురాలు చెరుకులపాడు శ్రీదేవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా నిలుపుతానని ఆయన అన్నారు. శ్రీదేవి భవిష్యత్తును ఇక ప్రజల చేతుల్లో పెడుతున్నానని జగన్ వ్యాఖ్యానించారు.
టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెరుకులపాడు నారాయణ రెడ్డి అనంతరం వైసీపీలో చేరారు. అయితే, ఈ ఏడాది మే 21న ఆయన హత్యకు గురయ్యారు. దీంతో చివరకు చెరుకులపాటి నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిని పత్తికొండ శాసనసభ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు జగన్ తెలిపారు. పత్తికొండలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కేఈ కృష్ణమూర్తి గెలుపొందిన విషయం తెలిసిందే.