team india: సెంచరీ మార్కు దాటిన టీమిండియా.. బౌలర్ల ఆటలు సాగనీయని పుజారా, విజయ్!
- రెండో రోజు ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్ మన్
- రెండు సార్లు క్యాచ్ ప్రమాదం నుంచి బయటపడ్డ మురళీ విజయ్
- నింపాదిగా ఆడుతూ ఆకట్టుకుంటున్న విజయ్, పుజారా
నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆకట్టుకుంది. తొలిరోజు శ్రీలంకను 202 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత జట్టు రెండో రోజు బ్యాటింగ్ లో నిలకడ ప్రదర్శించింది. ఓపెనర్ మురళీ విజయ్ (61), ఛటేశ్వర్ పుజారా (33) కలసి నింపాదిగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో ఏమాత్రం తొందరపడకుండా ఆచితూచి ఆడుతున్నారు.
ఈ క్రమంలో రెండు సార్లు మురళీ విజయ్ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒకసారి బౌలర్ ఆలస్యంగా కదలడంతో క్యాచ్ మిస్ కాగా, రెండోసారి కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకున్న ఫీల్డర్ చేతి నుంచి చివరి క్షణంలో అది జారిపోవడంతో బతికి పోయాడు. దీంతో 47 ఓవర్లు ఆడిన టీమిండియా 104 పరుగులు చేసింది. క్రీజులో పుజారా, విజయ్ ఉన్నారు.