second test: సత్తా చాటిన మురళీ విజయ్.. దూకుడు పెంచిన భారత్ బ్యాట్స్ మెన్!

  • మరో హాఫ్ సెంచరీ చేసిన మురళీ విజయ్
  • టెస్టుల్లో 16వ అర్ధ శతకం పూర్తి చేసిన మురళీ
  • వేగం అందుకున్న భారత స్కోరు బోర్డు

నాగపూర్ లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ మురళీ విజయ్ సత్తా చాటాడు. టెస్ట్ కెరీర్ లో 16వ అర్ధ శతకాన్ని సాధించాడు. మ్యాచ్ రెండో రోజు ఒక వికెట్ నష్టానికి 11 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు తొలుత నెమ్మదిగా ఆడుతూ, క్రీజులో కుదురుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా పరుగుల వేగాన్ని పెంచారు.

ఎలాంటి ఇబ్బంది లేకుండా మురళీ విజయ్, చటేశ్వర్ పుజారాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో ఫోర్ సాయంతో విజయ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 93 పరుగులు. పుజారా (30), విజయ్ (55) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ మరో 112 పరుగులు వెనకబడి ఉంది. 

second test
india vs sri lanka
nagapur test
murali vijay
team india
sri lanka cricket
  • Error fetching data: Network response was not ok

More Telugu News