arjun kapoor: నా మద్దతు ఎప్పుడూ అర్జున్ కపూర్ కే వుంటుంది!: పరిణీతి చోప్రా

  • అర్జున్ కపూర్ పట్ల ప్రత్యేక అభిమానం ప్రకటించిన పరిణీతి 
  • అర్జున్ కపూర్ కి తన జీవితంలో ప్రత్యేక స్థానం
  • తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది

తుది శ్వాస విడిచే వరకు అర్జున్ కపూర్ కి మద్దతుగా నిలుస్తానని పరిణీతి చోప్రా తెలిపింది. అర్జున్ కపూర్ తో తన రెండవ సినిమా 'సందీప్ ఔర్ పింకీ ఫరార్' సినిమా షూటింగ్ ప్రారంభం నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ, అర్జున్‌ కి తొలి సహ నటిని తానేనని గుర్తు చేసింది. తమ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపింది. అర్జున్‌ గురించి ఎప్పుడు తప్పుడు వార్తలు వచ్చినా, అతనిని సమర్థిస్తూనే ఉంటానని తెలిపింది.

తన జీవితంలో అతనిది ప్రత్యేక స్థానమని పరిణీతి పేర్కొంది. తనకు ఎవరైనా నచ్చని పక్షంలో వారు నచ్చేలా చేసుకుంటానని అంది. కాగా, ప్రియాంకా చోప్రా సోదరిగా 'లేడీస్ వర్సెస్ రికీ బెహల్' సినిమాతో రణ్ వీర్ సింగ్ సరసన తెరంగేట్రం చేసినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత అర్జున్ కపూర్ తో కలిసి నటించిన 'ఇషక్ జాదే' సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు చేజిక్కించుకుని స్టార్ డమ్ సంపాదించుకుంది.

arjun kapoor
parineeti chopra
new movie
  • Loading...

More Telugu News