nani: ప్రొడ్యూసర్ గా నాని కొత్త అవతారం.. 80 శాతం పూర్తైన షూటింగ్.. వీడియో పోస్ట్ చేసిన నేచురల్ స్టార్

  • సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నాని
  • ఎవరూ చూడని కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ
  • ఈ సాయంత్రం ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్

వరుస హిట్లతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని కొత్త అవతారం ఎత్తాడు. నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నానని తెలిపాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఈ సాయంత్రం ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పాడు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశాడు.  

"హాయ్, ఒక చిన్న అనౌన్స్ మెంట్. అందుకే ఈ వీడియో. ఈ ఇయర్ బిగినింగ్ లో ప్రశాంత్ అనే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథలో ఓ చిన్న పాత్రకు నన్ను వాయిస్ ఓవర్ అడిగాడు. ఆ కథ చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఎవరూ ఇలాంటి కథను స్క్రీన్ మీద చూడలేదనిపించింది. ఇలాంటి సినిమాకు సరైన టీమ్, సపోర్ట్ అవసరమనిపించింది. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రశాంత్? అని అడిగా.

'ఇంకా తెలియదు భయ్యా... ఎలాగోలా మేనేజ్ చేస్తా'నని చెప్పాడు. ఇది మేనేజ్ చేసే సినిమా కాదు... సరిగా చేయాలని చెప్పా. నేనే ఎందుకు ప్రొడ్యూస్ చేయకూడదు అని నాకు అనిపించింది. వెంటనే, ఈ సినిమాను నేనే ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పాను. ఆ తర్వాత ఎంతో మంది ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు ఈ కథ విని, నచ్చి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఫిబ్రవరిలో మీ అందరి ముందుకు ఈ సినిమాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ లుక్ రిలీజ్, టైటిల్ అనౌన్స్ మెంట్ కోసమే ఈ వీడియో. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటాయి" అంటూ నాని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. 

nani
hero nani
tollywood
producer nani
  • Error fetching data: Network response was not ok

More Telugu News