piyush sahadev: రేప్ కేసులో అరెస్టైన ప్రముఖ టీవీ నటుడు సహదేవ్

  • ఇటీవలే భార్యకు విడాకులిచ్చిన సహదేవ్
  • ప్రస్తుతం ముంబై ఫ్యాషన్ డిజైనర్ తో సహజీవనం
  • మోసం చేశాడంటూ కేసు పెట్టిన ఫ్యాషన్ డిజైనర్

ఇటీవలే భార్యకు విడాకులిచ్చి వార్తల్లోకి ఎక్కిన ప్రముఖ టీవీ నటుడు పియూష్ సహదేవ్ (35) అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ సహదేవ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, అతడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఒక ఫ్యాషన్ షోలో తనకు సహదేవ్ పరిచయం అయ్యాడని... ఆ తర్వాత తనతో స్నేహం చేసి, మోసం చేశాడని సదరు ఫ్యాషన్ డిజైనర్ (23) తన ఫిర్యాదులో పేర్కొంది.

తామిద్దరం సహజీవనం చేస్తున్నామని... పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ నేపథ్యంలో సహదేవ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు... అతడిని అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కోర్టు అతడికి 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. బేహద్ దేవోంకే దేవ్ మహదేవ్, హర్ ఘర్ కుచ్ కెహతా హై లాంటి పాప్యులర్ హిందీ సీరియల్స్ ద్వారా సహదేవ్ మంచి పేరు సంపాదించుకున్నాడు. 

piyush sahadev
case on piyush sahadev
  • Loading...

More Telugu News