Pakistan: టీ20లో రికార్డు సృష్టించిన పాక్ ఓపెనర్లు అక్మల్, భట్!

  • టీ20ల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు
  • గత రికార్డులను బద్దలుగొట్టిన పాక్ ఓపెనర్లు
  • 209 పరుగులతో సరికొత్త రికార్డు 

పాకిస్థాన్ ఓపెనర్లు సల్మాన్ భట్, కమ్రాన్ అక్మల్‌లు టీ20ల్లో సరికొత్త రికార్డును నమోదు చేశారు. లాహోర్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా శుక్రవారం ఇస్లామాబాద్ రీజియన్-లాహోర్ రీజియన్ వైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ ఓపెనర్లు భట్, అక్మల్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. 71 బంతులు ఎదుర్కొన్న అక్మల్ 14  ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. సల్మాన్ భట్ 49 బంతుల్లో 8 ఫోర్లతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం 20 ఓవర్లను వీరిద్దరే ఆడేశారు. వైడ్ల రూపంలో నాలుగు పరుగులు లభించాయి. దీంతో వీరిద్దరి ఓపెనింగ్ భాగస్వామ్యంలో 209 పరుగులు వచ్చాయి.

టీ20 క్రికెట్ చరిత్రలో భట్, అక్మల్ నెలకొల్పిన ఈ 209 పరుగుల భాగస్వామ్యమే ఇప్పటి వరకు అత్యధికం. వీరిదెబ్బతో ఇప్పటి వరకు ఉన్న 207 పరుగుల భాగస్వామ్యం రికార్డు బద్దలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఇస్లామాబాద్ రీజియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 100 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

Pakistan
Cricket
T20
salman Butt
kamran Akmal
  • Loading...

More Telugu News