rama mandir: రామ మందిరం మాత్రమే నిర్మించాలి.. ఇంకే నిర్మాణాలు కాదు: అయోధ్య‌పై మోహ‌న్ భ‌గ‌వ‌త్‌

  • కర్ణాటకలో జరుగుతున్న ‘ధర్మ సంసద్‌’ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్ర‌సంగం
  • త్వరలోనే రామ మందిరాన్ని నిర్మిస్తాం
  • ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం
  • దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది

వివాదాస్ప‌దంగా మారిన‌ అయోధ్య విష‌యంపై కీల‌క‌ చ‌ర్చ‌లు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు శ్రీ శ్రీ ర‌విశంక‌ర్ కూడా అక్క‌డ‌కు వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్రమంలో అయోధ్య‌లో రామ మందిరం విష‌యంపై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్‌ మోహన్‌ భగవత్ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

కర్ణాటకలోని ఉడుపిలో జరుగుతున్న ‘ధర్మ సంసద్‌’ కార్యక్రమంలో ఆయ‌న ఉప‌న్యాసం ఇచ్చారు. అయోధ్యలో రామ మందిరం మాత్రమే నిర్మించాలని, ఇంకే నిర్మాణాలు చేబట్టరాదని అన్నారు. త్వరలోనే రామ మందిరాన్ని నిర్మిస్తామ‌ని, ఇది విశ్వాసానికి సంబంధించిన అంశమ‌ని, దాన్ని మార్చలేమ‌ని అన్నారు. అంతకు ముందు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.  

rama mandir
ayodhya
mohan bhagavat
  • Loading...

More Telugu News