TAMMINENI SEETHARAM: 'సైకో ఫ్లవర్' అంటూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన తమ్మినేని సీతారాం

  • సైకో ఫ్లవర్ ముట్టుకుంటే విషం చిమ్ముతుంది
  • చంద్రబాబు జీవితమంతా వెన్నుపోటు రాజకీయమే
  • జగన్ ప్రభంజనాన్ని చంద్రబాబు తట్టుకోలేరు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి తమ్మనేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓ సైకో ప్లవర్ అంటూ మండిపడ్డారు. సైకో ఫ్లవర్ ను ముట్టుకుంటే విషం చిమ్ముతుందని... చంద్రబాబు వద్దకు వెళ్లినా అంతేనని చెప్పారు. చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమేనని... జీవిత కాలంలో ఆయన ఏనాడూ నీతివంతమైన రాజకీయాలు చేయలేదని విమర్శించారు. పార్టీలోకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి చేర్చుకోవడం జగన్ నీతి అయితే.... అడ్డగోలుగా కొనుగోలు చేసి, వారిని కేబినెట్ లో చేర్చుకోవడం చంద్రబాబు నైజం అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని అన్నారు.

ఎన్టీఆర్ పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు... మళ్లీ అదే ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చారని తమ్మినేని ఎద్దేవా చేశారు. తన రాజకీయ గురువైన అమర్ నాథ్ రెడ్డిని నాడు మోసం చేయడం, ఇప్పుడు ఆయన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డిని పొగడటం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నల్లారి సోదరుల పాత్ర ఉందంటూ ఆరోపించిన చంద్రబాబు... ఇప్పుడు వారినే టీడీపీలో చేర్చుకున్నారని... చంద్రబాబు నీతి ఎలాంటిదో దీంతో అర్థమవుతుందని చెప్పారు. జగన్ ప్రభంజనాన్ని చంద్రబాబు తట్టుకోలేరని... 2019లో చంద్రబాబుకు జైలు తప్పదని అన్నారు.

TAMMINENI SEETHARAM
Chandrababu
kiran kumar reddy
  • Loading...

More Telugu News