kangana: ఎప్పుడు గాయపడతానా? అని ఎదురు చూశాను: కంగనా

  • 60 రోజులు నిర్విరామంగా షూటింగ్
  •  విశ్రాంతి అన్నది లేదు 
  • ఎప్పుడు గాయమవుతుందా? ఇంటికెళ్లి రెస్టు తీసుకుంటానా? అని ఎదురు చూశాను

'ఎప్పుడు గాయపడతానా?' అని తాను ఎదురు చూశానని బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ తెలిపింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్న కంగనా రనౌత్ కాలికి గాయమై రెస్టు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఆమె మాట్లాడుతూ, ‘60 రోజుల నుంచి నిర్విరామంగా చిత్రీకరణలో పాల్గొంటున్నాను. దాంతో విశ్రాంతి అన్నది లేదు. దాంతో ఎప్పుడెప్పుడు నాకు గాయం అవుతుందా.. ఇంటికి వెళ్లి ఎప్పుడు విశ్రాంతి తీసుకుందామా? అని నాలో నేనే అనుకుంటూ ఉండేదానిని. అనుకున్నట్టే జరిగింది' అని చెప్పింది.

తనకు గాయమై రెస్టు తీసుకుంటున్నప్పటికీ డైరెక్టర్ క్రిష్‌, చిత్రయూనిట్ జోధ్‌ పూర్‌ లో తరువాతి సన్నివేశాలకు అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారని ఆమె తెలిపింది. కాగా, రెండు నెలల క్రితం పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఆమె నుదిటికి కత్తి తగిలి గాయమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఝాన్సీ రాణి కోసం ఎంత కష్టమైనా భరిస్తానని, గాయం కావడం గర్వంగా ఉందని పేర్కొన్న సంగతి తెలిసిందే. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News