life saving drugs: ప్రాణాల్ని కాపాడే ఔషధాలకు రెక్కలు... జీఎస్టీలో లెవీ విధింపే కారణం!
- దిగుమతి చేసుకునే ఔషధాలపై 12 శాతం లెవీ
- అవయవ మార్పిడి రోగులపై భారం
- ఏడు కోట్ల మంది రోగులపై అధిక భారం
ప్రాణ రక్షక ఔషధాలపై భారం పడింది. దిగుమతి చేసుకునే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పై జీఎస్టీలో 12 శాతం లెవీని ప్రభుత్వం విధించడమే ఇందుకు కారణం. అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు... మెలనోమా, క్రాన్స్ డిసీజ్, బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ తదితర చికిత్సలు చేయించుకున్న వారికి వైద్యులు జీవిత కాలం పాటు మందులు వాడాలని సూచిస్తుంటారు. ఈ ఔషధాలను రోగులు నేరుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు.
కాకపోతే జీఎస్టీ రాకముందు వీటిపై ఎటువంటి భారం లేకపోగా, ఇప్పుడు 12 శాతం లెవీ విధించారు. మన దేశంలో ఏడు కోట్ల మంది రోగులు ఈ తరహా వ్యాధులతో పోరాడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కాకపోతే మన దేశంలోనే విక్రయమయ్యే ఔషధాలపై జీఎస్టీ కారణంగా ధరల్లో పెద్ద మార్పు లేదు. పన్ను అంతకుముందుతో పోలిస్తే కేవలం 2.29 శాతమే పెరిగింది.