r narayana murty: దీపికా పదుకునే తలను నరకమంటారా.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?: ఆర్.నారాయణమూర్తి

  • నంది అవార్డులు ఎవరి సొత్తు కాదు
  • ప్రజల పన్నులతో అవార్డులు ఇస్తున్నారు
  • 'రుద్రమదేవి'కి అవార్డు ఇచ్చి ఉండాల్సింది

'పద్మావతి' సినిమా ఇంకా విడుదల కానేలేదు, ఎవరూ చూడనే లేదు... ఇలాంటి పరిస్థితిలో ఆ సినిమాను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ప్రముఖ సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఆ సినిమాలో నటించిన దీపికా పదుకునే, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీల తలలకు వెలకట్టడం ఏమిటి? ఇది ప్రజాస్వామ్యమా? అంటూ మండిపడ్డారు.

 నంది అవార్డులు ఎవరి సొత్తు కాదని... ప్రజలు చెల్లించిన పన్నులతోనే వాటిని అందజేస్తున్నారని చెప్పారు. గుణశేఖర్ రూపొందించిన 'రుద్రమదేవి'కి అవార్డు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. అవార్డుల విషయంలో పునరాలోచించుకోవాలని సూచించారు. గతంలో ఉత్తమ సినిమాలను ఎంపిక చేసేటప్పుడు అవి సమాజం, సంస్కృతి, సంప్రదాయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపాయనే విషయాన్ని పరిశీలించేవారని... ప్రస్తుతం ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది? అనేవి చూస్తున్నారని చెప్పారు. 

r narayana murty
tollywood
nandi awards
  • Loading...

More Telugu News