hafeez saeed: పాక్ ను ఏకం చేసి...కశ్మీరీల కోసం పోరాడుతా: హఫీజ్ సయీద్
- కశ్మీర్ కు మద్దతిస్తున్నాననే 10 నెలలుగా గృహనిర్బంధం
- వారి కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను
- కశ్మీరీలు కోరుకునే స్వాతంత్ర్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను
జమాత్-ఉద్-దవా (జేయూడీ) అధినేత, 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ గృహనిర్బంధం నుంచి విడుదలైన కాసేపటికే భారత్ పై విషంగక్కాడు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశాడు. అందులో ‘కశ్మీర్‌కు మద్దతిస్తున్నాననే 10 నెలలుగా నన్ను గృహనిర్బంధం చేశారు. ఇకపై కశ్మీరీల కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తాను. ఇందుకోసం పాకిస్థాన్ ప్రజలను ఏకం చేసి కశ్మీరీలు కోరుకునే స్వాతంత్ర్యాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాను’ అన్నాడు.
భారత్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తోందని, అయినప్పటికీ వీటిని న్యాయస్థానం నమ్మలేదని చెప్పాడు. గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని ఆదేశించడం ద్వారా తాను అమాయకుడినని న్యాయస్థానం కూడా ధ్రువీకరించిందని పేర్కొన్నాడు. కాగా, జనవరి 31 నుంచి హఫీజ్ సయీద్ గృహనిర్బంధంలో ఉన్నాడు.